నాతో పాటు ఇండస్ట్రీలో లీడ్‌లో ఉన్న హీరోయిన్లు ఎవరూ చేయని పనిని నేను చేశాను. వాళ్లందరూ కెరీర్ కోసం పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు. కానీ నేను అలా చేయలేదు. నాకు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే చేసుకున్నాను అని అన్నారు కరీనా కపూర్. పూర్తిగా తన ఇష్టప్రకారమే ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని మిగిలిన హీరోయిన్లు అందరూ ఫాలో కావడం ఆనందంగా ఉందని అన్నారు కరీనా కపూర్. 2000 ఏడాది అభిషేక్ బచ్చన్ సినిమా రెఫ్యూజీతో కెరీర్ మొదలుపెట్టారు కరీనా.
కెరీర్‌లో 12 ఏళ్ల పాటు సక్సెస్ చూశాక 2012లో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె కెరీర్‌కి బ్రేక్ ఎప్పుడూ ఇవ్వలేదు. దబాంగ్2 సినిమా కూడా ఆఫ్టర్ మేరేజ్ చేసిందే. బాక్సాఫీస్ నెంబర్లు ఎప్పుడైనా కరీనాకు డిస్టర్బెన్స్ కలగజేస్తాయా అని అడిగితే ``నేను వాటి గురించి అసలు ఎప్పుడూ ఆలోచించను. నేనేం చేయాలనుకున్నానో అదే చేశాను. అవన్నీ కలిసొచ్చాయి. పెళ్లి చేసుకోవాలనిపించింది. చేసుకున్నాను. నేను వివాహం చేసుకున్నప్పుడు మరే హీరోయిన్ ఆ ధైర్యం చేయలేదు. అప్పట్లో పెళ్లి తర్వాత యాక్ట్ చేయడాన్ని పెద్ద విషయంగా చెప్పుకున్నారు. ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లొచ్చినంత తేలిగ్గా వర్క్ నీ, పర్సనల్ లైఫ్‌నీ బ్యాలన్స్ చేస్తున్నారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా పని చేశాను. ర్యాంప్ వాక్ చేశాను. తైమూర్ పుట్టాక జస్ట్ రెండు నెలలే బ్రేక్ తీసుకున్నాను. జే పుట్టినప్పుడైతే నెలలోపే సెట్స్ కి వెళ్లాను`` అని అన్నారు. కరీనా నటించిన లాల్ సింగ్ చద్దా లాస్ట్ ఇయర్ విడుదలైంది.
సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అలాంటివాటిని పెద్దగా పట్టించుకోను అని అన్నారు కరీనా కపూర్. ఆమె చేతిలో ప్రస్తుతం ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులున్నాయి. ది క్రూ, ది బకింగ్‌హాం మర్డర్స్, ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ సినిమాలు త్వరలోనే కరీనాలోని ఇంకో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాయి.